Kadem: ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. ప్రస్తుత నీటి నిల్వ ఎంతంటే?

Kadem: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 165 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రస్తుతం నీటిమట్టం 682 అడుగులు కాగా, నిల్వ 0.697 టీఎంసీలకు చేరింది.

RAKESH N, KHANAPUR
Published on: 26 July 2026 12:17 PM IST
Kadem
X

Kadem: ప్రాజెక్టుకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. ప్రస్తుత నీటి నిల్వ ఎంతంటే?

కడెం ప్రాజెక్టుకు స్వల్పంగా పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. ప్రస్తుత నీటి నిల్వ 0.697 టీఎంసీలు

నిర్మల్ జిల్లా// కడెం మండలంలో: నారాయణరెడ్డి (కడెం) ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 682.025 అడుగులుగా నమోదైంది. అలాగే, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 0.697 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి 165 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ,

66 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో రూపంలో దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రధాన గేట్లు ప్రస్తుతం మూసివేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందాల్సి ఉంది.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story