Nirmal: నిండుకుండలా కడెం: 9 గేట్లు ఎత్తివేత.. పరిశీలించిన ఎస్పీ!

Nirmal: కడెం ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో 9 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు.

RAKESH N, KHANAPUR
Published on: 30 July 2026 12:11 PM IST
Nirmal
X

Nirmal: నిండుకుండలా కడెం: 9 గేట్లు ఎత్తివేత.. పరిశీలించిన ఎస్పీ!

నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులోకి వరద ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన 9 గేట్లను ఎత్తివేసి, నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా// కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుని ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను, వరద ఉధృతిని ఆమె పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ప్రస్తుత నీటి మట్టం, వరద ప్రవాహం వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు, పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రాజెక్టు సమీపంలోకి ఎవరూ వెళ్లకూడదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story