Kadem: కడెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. 9.5 తులాల బంగారం అపహరణ!
Kadem: నిర్మల్ జిల్లా కడెంలో తాళం వేసిన ఇరిగేషన్ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ. 9.5 తులాల బంగారు ఆభరణాలు అపహరించిన దుండగులు. ఖానాపూర్ సిఐ దర్యాప్తు.
Kadem: కడెంలో తాళం వేసిన ఇంట్లో చోరీ.. 9.5 తులాల బంగారం అపహరణ!
Kadem: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రానికి చెందిన మ్యాదరి పార్వతి (ఇరిగేషన్ ఉద్యోగి) తమ బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి బుధవారం ఉదయం జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్ళింది. అయితే సాయంత్రం ఇంటికి వచ్చి డోర్ తీసి ఇంట్లోకి అడుగుపెట్టేసరికి ఇంటి వెనకాల డోర్ తెరిచి ఉండడంతో ఒక్కసారిగా కంగుతింది.
హుటా హుటిన బీరువా తెరిచి చూసేసరికి బీరువాలో దాచి ఉంచిన 9.5 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
దీంతో ఘటన స్థలాన్ని ఖానాపూర్ సిఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని సందర్శించి సీసీ కెమెరాలను పరిశీలించి సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story




