Mancherial: మంచిర్యాల జిల్లాలో పోలీసుల మెరుపు తనిఖీలు రంగంలోకి డాగ్ స్క్వాడ్!

Mancherial: జైపూర్ పరిధిలో గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు, యాంటీ నార్కోటిక్స్ వింగ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

RAJENDER, CHENNUR
Published on: 23 May 2026 3:20 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లాలో పోలీసుల మెరుపు తనిఖీలు రంగంలోకి డాగ్ స్క్వాడ్!

మంచిర్యాల జిల్లా: జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో జైపూర్, ఇందారం బస్టాండ్స్ లో, మరియు పరిసర ప్రాంతాలలో పోలీస్ సిబ్బంది, యాంటీ నార్కోటిక్స్ వింగ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు – జైపూర్ సిఐ నవీన్ కుమార్, ఎస్సై భూమేష్.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్, మంచిర్యాల నార్కోటిక్ టీమ్ సమన్వయంతో నార్కోటిక్ స్నిఫర్ డాగ్ స్క్వాడ్ సహకారంతో జైపూర్ బస్టాండ్, పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, పాన్ షాపులు, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు, గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని జైపూర్ ఎస్సై భూమేష్ సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై భూమేష్ తెలిపారు. ఈ తనిఖీలలో యాంటీ నార్కోటిక్ వింగ్ సిబ్బంది, జైపూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story