Ichoda: ఇచ్చోడలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి బిఆర్‌ఎస్ నిరసన!
Ichoda: కాంగ్రెస్ ప్రభుత్వ హామీల వైఫల్యంపై ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో వినూత్న నిరసన. దున్నపోతుకు వినతిపత్రం అందజేసిన మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి.
Ichoda: ఇచ్చోడలో దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చి బిఆర్‌ఎస్ నిరసన!
Ichoda: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖరా(కె) గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.. ఆయనకు చెప్పినా, దున్నపోతుకు చెప్పినా ఒక్కటే నువ్వైనా మా గోడు విను" అంటూ గ్రామంలోని దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు నెలకు ₹2,500, పెన్షన్దారులకు ₹4,000, రైతులకు ₹15,000 రైతుభరోసా, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఏవీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నాయకత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ ప్రముఖులు తిరుపతి, విఠల్, మారుతి, నర్సింగ్, దత్త, వెంకటి తదితరులు పాల్గొన్నారు.




