Indervelly: ఇంద్రవెల్లి-గుడిహత్నూర్ అక్రమ రవాణాపై ఆటో డ్రైవర్ల అప్రమత్తం

Indervelly: ఇంద్రవెల్లి-గుడిహత్నూర్ ఆటో డ్రైవర్ల ముఖ్య సమావేశం. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో పోలీసులకు సహకరించాలని యూనియన్ అధ్యక్షుడు వసీం ఖాన్ పిలుపు.

NAGULA SATISH, BOATH
Published on: 18 July 2026 2:36 PM IST
Indervelly
X

Indervelly: ఇంద్రవెల్లి-గుడిహత్నూర్ అక్రమ రవాణాపై ఆటో డ్రైవర్ల అప్రమత్తం

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి నుండి గుడిహత్నూర్ మార్గంలో నడుస్తున్న ఆటో డ్రైవర్ల యూనియన్ ముఖ్య సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో గుడిహత్నూర్ ఆటో మండల అధ్యక్షుడు వసీం ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చుట్టుపక్కల ప్రాంతాలలో జరుగుతున్న వివిధ రకాల అక్రమ రవాణా (స్మగ్లింగ్) కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని గుర్తుచేశారు.

సమాజ బాధ్యతగా పోలీసు సిబ్బందికి తగిన సమాచారం అందించి సహకరించడం ఆటో కార్మికులందరి ప్రాథమిక కర్తవ్యమని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనిపించినా వెంటనే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

​ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సాయి, నాయకులు ధీరజ్, హరిదాసు, సాజిద్, ఖయ్యాం తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story