Nirmal: ఆలయాల పరిరక్షణే లక్ష్యం హిందూ సంస్కృతిపై దాడులను అరికడదాం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాడ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో యోగాధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ ఉదయ్ మహారాజ్ స్వామీజీ పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 6 May 2026 12:55 PM IST
Nirmal
X

Nirmal: ఆలయాల పరిరక్షణే లక్ష్యం హిందూ సంస్కృతిపై దాడులను అరికడదాం!

నిర్మల్: హిందువులందరినీ ఏకం ఏకం చేసేందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు యోగాధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హిందూ ధర్మ ప్రచారకులు శ్రీశ్రీశ్రీ ఉదయ్ మహారాజ్ స్వామీజీ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చింతకుంట వాడ బస్తీలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా కార్యనిర్వహణ సమితి అధ్యక్షులు నవయుగ మూర్తి మరియు కార్యవర్గ సభ్యులతో గోమాత పూజ అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలో పరిపూర్ణమైన శాశ్వతమైన ఆధ్యాత్మికమైన ధర్మం హిందుత్వం మాత్రమేనని అన్నారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్యపరిచి భారతదేశాన్ని విశ్వగురుగా నింపాలనే లక్ష్యంతో ఇటువంటి మహోత్తరమైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి ఆలయాల నుండే ప్రారంభమైందని హిందు ఆలయాల పై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మన హిందూ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story