Ichoda: ఇచ్చోడలో వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్‌చల్!

Ichoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఓ మహిళ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తానంటూ హల్‌చల్ చేసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఆమెను సురక్షితంగా కిందకు దించారు.

NAGULA SATISH, BOATH
Published on: 5 Sept 2026 1:31 PM IST
Ichoda
X

Ichoda: ఇచ్చోడలో వాటర్ ట్యాంక్ ఎక్కి మహిళ హల్‌చల్!

Ichoda: ​ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఓ మహిళ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి దుకేస్తానంటూ హాల్ చల్ చేసింది, స్థానిక భీమన్నగుట్ట వద్ద ఉన్న వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కిన మహిళ అకస్మాత్తుగా పైనుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అయితే సదరు మహిళ మతిస్థిమితం కోల్పోయి ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సదరు మహిళ కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాటర్ ట్యాంక్ పైనుంచి కిందకు దూకవద్దంటూ ఆమెను మాటల్లో పెట్టి, సురక్షితంగా కిందకు దింపేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించి చివరకు ఆమెను సురక్షితంగా కిందకు దించారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story