Gudihathnoor: డ్రిప్ ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన.. పరిశీలించిన హెచ్ఈఓ శేఖర్!
Gudihathnoor: గుడిహత్నూర్ మండలంలో ఉద్యాన శాఖ విస్తరణ అధికారి (HEO) ఆడెపు శేఖర్ కూరగాయల తోటలను పరిశీలించారు.
Gudihathnoor: డ్రిప్ ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన.. పరిశీలించిన హెచ్ఈఓ శేఖర్!
గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు, కొలహరి, గుర్జు గ్రామాల్లో ఉద్యాన శాఖ విస్తరణ అధికారి ఆడెపు శేఖర్ ఈరోజు కూరగాయల తోటలను సందర్శించి రైతులకు తగిన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా 'తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ (TGMIP)' కింద అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ పథకాలపై వివరాలు వెల్లడించారు.
ఈ పథకం ద్వారా SC, ST రైతులకు 90 శాతం, BCలతో పాటు చిన్న, సన్నకారు రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. డ్రిప్ విధానంతో నీటి ఆదాతో పాటు పంట దిగుబడి పెరుగుతుందని తెలిపారు. అర్హులైన గుడిహత్నూరూ, ఇచ్చోడ, సిరికొండ మండలాల రైతులు మరిన్ని వివరాల కోసం HEO ఆడెపు శేఖర్ (ఫోన్: 9951777993) ను సంప్రదించాలని సూచించారు.
Next Story




