Gudihatnur: జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ - వాహనదారుల అవస్థలు

Gudihatnur: గుడిహత్నూర్ హైవేపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. గంటల తరబడి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, ప్రయాణికులు.

NAGULA SATISH, BOATH
Published on: 12 Sept 2026 9:50 PM IST
Gudihatnur
X

Gudihatnur: జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ - వాహనదారుల అవస్థలు

గుడిహత్నూర్: ​గుడిహత్నూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మరోసారి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారిపై మరమ్మతుల పేరిట వాహనాలను సర్వీస్ రోడ్డు మీదుగా మళ్లిస్తుండడంతో సమస్య తీవ్రరూపం దాల్చింది.

సంబంధిత కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యం వహించి గత నెల రోజులుగా హైవే పనులను పూర్తిగా నిలిపివేయడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ఓవైపు పనులు జరగక, మరోవైపు ఇరుకైన సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్తుండటం, తరచూ ఆ మార్గంలో వాహనాలు బ్రేక్ డౌన్ అవుతుండడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

​ప్రస్తుతం సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఉండటంతో వాహనదారులు, ప్రయాణికులు గంటల తరబడి మార్గమధ్యంలోనే చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, బ్రేక్ డౌన్ అయిన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని, నిలిచిపోయిన హైవే పనులను కాంట్రాక్టర్‌తో వెంటనే ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH