Gudihatnoor: గుడిహత్నూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా!

Gudihatnoor: రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ గుడిహత్నూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నేతల డిమాండ్.

NAGULA SATISH, BOATH
Published on: 23 July 2026 4:04 PM IST
Gudihatnoor
X

Gudihatnoor: గుడిహత్నూర్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా!

Gudihatnoor: నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధితులకు మద్దతు తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి బస్టాండ్ ఎదుట గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.

​ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా విఘాతం కలిగించడమేనని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ఉయిక అనుసుయా, కాంగ్రెస్ నాయకులు నాగ్ నాథ్ అప్ప, పెందూర్ జైరాం, పవార్ అమీన్, ఆరీఫ్ ఖాన్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story