Gudihathnur: గుడిహత్నూర్ పీఏసీఎస్ యూరియా గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

Gudihathnur: గుడిహత్నూర్ మండల కేంద్రంలో పీఏసీఎస్ యూరియా గోదామును తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా. జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని వెల్లడి.

NAGULA SATISH, BOATH
Published on: 12 Aug 2026 6:17 PM IST
Gudihathnur
X

Gudihathnur: గుడిహత్నూర్ పీఏసీఎస్ యూరియా గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

గుడిహత్నూర్: జిల్లాలో సాగు సమయానికి రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ యూరియా గోదామును, డిజిటల్ బుకింగ్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలను పరిశీలించిన ఆయన, యాప్ బుకింగ్‌లో రైతులకు సాంకేతిక సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

​జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందవద్దని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని కోరారు. డిజిటల్ బుకింగ్ ద్వారా పారదర్శక పంపిణీ జరుగుతోందని, ఎరువులను ఎంఆర్‌పీకే విక్రయించాలని స్పష్టం చేశారు.

ఒకవేళ ఎవరైనా అధిక ధరలకు అమ్మినా, అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకు వేగంగా ఎరువులు అందేలా వ్యవసాయ శాఖ నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story