Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల ప్రత్యేక డ్రైవ్!

Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల ప్రత్యేక డ్రైవ్. చదువు మధ్యలో ఆపేసిన వారు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.

NAGULA SATISH, BOATH
Published on: 31 Aug 2026 3:20 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: గుడిహత్నూర్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల ప్రత్యేక డ్రైవ్!

Gudihathnoor: m​గుడిహత్నూర్ మండలంలో సోమవారం ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రవేశాల నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. చదువుకు దూరమైన విద్యార్థులను తిరిగి విద్యాభ్యాసం వైపు ప్రోత్సహించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు విద్యార్థులను ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్లలో చేర్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, డ్రాపౌట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్ విధానాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.

​ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీ ఎన్. అశోక్, గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. దేవదాస్, ఓపెన్ స్కూల్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రథమ్ ఫౌండేషన్ ఇంచార్జ్ కిరణ్, అలాగే గుడిహత్నూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓపెన్ స్కూల్ ఇంచార్జ్ శ్రీ ఎండీ అస్లాం తదితరులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story