Nirmal: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడివాడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు.
Nirmal: వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు!
నిర్మల్: జై వాసవి జై జై వాసవి శ్రావణమాసం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని నాయుడివాడలో గల కమల్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో శ్రావణమాసం మొదటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గాజులతో అలంకరించి కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
శ్రావణ మాసంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ పొందాలని వేడుకున్నారు. తమ కుటుంబ సభ్యులతో పాటు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో విరాజిల్లి పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నట్లు భక్తులు పేర్కొన్నారు.
Next Story




