Dasturabad: విద్యార్థులకు సొంత ఖర్చులతో విద్యా సామాగ్రి అందించిన ఉపాధ్యాయుడు

Dasturabad: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం మున్యాల్ పాఠశాల విద్యార్థులకు సొంత ఖర్చులతో విద్యా సామాగ్రి అందించిన సోషల్ టీచర్ దుర్గం భూమన్న. సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ.

RAKESH N, KHANAPUR
Published on: 24 Aug 2026 4:05 PM IST
Dasturabad
X

Dasturabad: విద్యార్థులకు సొంత ఖర్చులతో విద్యా సామాగ్రి అందించిన ఉపాధ్యాయుడు

దస్తూరాబాద్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండల కేంద్రంలోని మున్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

పాఠశాలలో సోషల్ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న దుర్గం భూమన్న తన సొంత ఖర్చులతో విద్యార్థుల భవిష్యత్తు కోసం సాయం అందించారు.

పాఠశాలలోని సుమారు 140 మంది విద్యార్థులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్‌లు, జామెట్రీ బాక్సులు మరియు అట్లాస్ పుస్తకాలను స్థానిక సర్పంచ్ లలిత రాజేష్ చేతుల మీదుగా పంపిణీ చేయించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు దుర్గం భూమన్న మాట్లాడుతూ, విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న సాయం చేసినట్లు తెలిపారు.

పిల్లల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయుడు చేసిన ఈ వినూత్న ప్రయత్నాన్ని, ఆయన ఉదారతను స్థానికులు మరియు తోటి ఉపాధ్యాయ బృందం అభినందించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story