Bellampalli: బెల్లంపల్లిలో మట్టి వినాయకుల పంపిణీ: ఎమ్మెల్యే గడ్డం వినోద్

Bellampalli: బెల్లంపల్లి కాంట చౌరస్తాలో జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 13 Sept 2026 7:09 PM IST
Bellampalli
X

Bellampalli: బెల్లంపల్లిలో మట్టి వినాయకుల పంపిణీ: ఎమ్మెల్యే గడ్డం వినోద్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి కాంట చౌరస్తాలో భక్తులకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామితో కలిసి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి దావ స్వాతి-రమేష్ బాబు భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ కారుకూరి రాంచందర్‌తో పాటు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, నాయకులు, జనహిత సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI