Nirmal: కుబీర్ జీపు ప్రమాదంలో నలుగురు మృతి విషాదంలో కుటుంబాలు!

Nirmal: కుబీర్ మండలం పార్థి (బి) గ్రామంలో జీపు బోల్తా పడి నలుగురు మృతి. మనుమలకు బొమ్మలు తెస్తామన్న మాటే చివరి మాటైంది.. శోకసంద్రంలో గ్రామం.

Srinivas, Mondol Bhainsa
Updated on: 1 Sept 2026 3:14 PM IST
Nirmal
X

Nirmal: కుబీర్ జీపు ప్రమాదంలో నలుగురు మృతి విషాదంలో కుటుంబాలు!

Nirmal: కుబేర్ మనుమలు,మనుమరాళ్ల కోసం బొమ్మలు తీసుకొస్తామని చెప్పి వెళ్లిన ఆ వృద్ధల ప్రయాణం విషాదాంతంగా మారింది. ఆనందంగా బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కుబీర్ మండలం పార్థి (బి) గ్రామానికి చెందిన ఆవుల గంగాధర్, తూము సాయిలు, తూము గౌరబాయి డ్రైవర్ తులసి రాం సోమవారం జిపు బొల్తాపడి జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.

ప్రమాదానికి ముందు మనుమలు, మనుమరాళ్ల కోసం బొమ్మలు తీసుకొస్తామని చెప్పి,అదే వారి చివరి మాటలుగా మిగిలిపోయాయి. తమ వాళ్లు వస్తారని ఎదురుచూసిన కుటుంబాలకు చివరకు విషాదవార్త చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మంగళవారం పార్డి బి గ్రామంలో 4 గురి అంత్యక్రియల వేళ కూటింబికుల రోదనలు మిన్నంటాయి.చివరి చూపు వేళ స్మశానంలో గ్రామస్తులు , బంధువులు శోకసంద్రంలో మునిగారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story