Sarangapur: పంట వివాదం ప్రాణం తీసింది కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో బలవన్మరణం

Sarangapur: నిర్మల్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన రైతు గజ్జల శ్రీధర్ చికిత్స పొందుతూ మృతి చెందారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 5 May 2026 12:23 PM IST
Sarangapur
X

Sarangapur: పంట వివాదం ప్రాణం తీసింది కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో బలవన్మరణం

సారంగాపూర్: నిర్మల్ లోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గత బుధవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గజ్జల శ్రీధర్ అనే రైతు మృతి తాను పండించిన వరి మొక్కజొన్న పంటలను మరో రైతు కోయనీయకపోవడంతో నష్టపోతున్నానని ఆవేదన మనస్థాపంతో కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రైతు శ్రీధర్ నిర్మల్ లోని కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి.

తన పంటను తోటి రైతు కోయకుండా అడ్డుకోవడంతో ఓ రైతు మనస్థాపానికి గురై కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన గజ్జల శ్రీధర్(39) అనే రైతు వరి మొక్కజొన్న పంటను వేశాడు. అయితే పంట కోతకు రావడంతో హార్వెస్టర్ యంత్రంతో పంట కోసేందుకు సిద్ధమయ్యాడు. అయితే పంటను కోయనీయకుండా తోటి రైతు అడ్డుకోవడంతో ఆవేదనకు గురయ్యాడు.

దీంతో గత నెల 29వ తేదీ బుధవారం సాయంత్రం నిర్మల్ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కార్యాలయ అధికారులు రైతును చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ నిన్న రాత్రి రైతు మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story