Adilabad: ఆదిలాబాద్లో నకిలీ పత్తి విత్తనాల భారీ ముఠా అరెస్ట్!
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో రూ.20 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టు అయింది.
Adilabad: ఆదిలాబాద్లో నకిలీ పత్తి విత్తనాల భారీ ముఠా అరెస్ట్!
ఆదిలాబాద్: జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 9 మంది మీద కేసు నమోదు కాగా ప్రధాన నిందితుడితో పాటు నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 792 విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని వెల్లడించారు.
గోదాంలో నిల్వ ఉంచిన విత్తనాలను 2టౌన్ పోలీసులు పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు. రైతులను మోసం చేసి అక్రమ లాభాల కోసం నకిలీ విత్తనాల వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ హెచ్చరించారు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా అధికారిక డీలర్ల వద్ద నుండి బిల్లుతో కొనుగోలు చేయాలని, అనుమానాస్పద విత్తనాలు లేదా పురుగుమందుల విక్రయాలపై సమీప పోలీసు స్టేషన్ లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
స్థానిక వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అందులో భాగంగానే ఆదిలాబాద్ పట్టణంలో ఒక గోడౌన్ నందు 750 విత్తన ప్యాకెట్లు లభ్యమైనట్టు తెలిపారు.




