Adilabad: పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబా దంపతుల అరెస్ట్!
Adilabad: బ్లాక్ మ్యాజిక్ తొలగిస్తానని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన నకిలీ బాబా దంపతులను అరెస్ట్ చేసిన ఆదిలాబాద్ పోలీసులు. వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్ రెడ్డి.
Adilabad: పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ బాబా దంపతుల అరెస్ట్!
Adilabad: పూజలు చేస్తే కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మించి, బ్లాక్ మ్యాజిక్ తొలగించకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరు చనిపోతారని భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేశారు ఆదిలాబాద్ పోలీసులు.. డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సలీం సయ్యద్ పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడు.
అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించి, మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి మహారాష్ట్రలోని యవత్మాల్‌కు తీసుకువెళ్లి అక్కడ భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేశాడు. అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుడి ప్రాణానికి ప్రమాదం జరుగుతుందని భయపెట్టినట్టు తెలిపారు.
నిందితుల మాటలపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.. మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి సూచించారు.
నిందితులు సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్, ( 40) s/o బషీర్, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర.
A2) సయ్యద్ షమా, ( 46) w/o సలీం, పెద్బాగ్ గ్రామం, వడ్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. ప్రజలు మూఢనమ్మకాలను విశ్వసించవద్దని ఆదిలాబాద్ డిఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో మావలా సీఐ బి డి ప్రేమ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




