Ichoda: ప్రకృతికే రాఖీ ఇచ్చోడ మండలం ముఖరా (కే)లో పర్యావరణ రక్షాబంధన్!
Ichoda: పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిచే ఇచ్చోడ మండలం ముఖరా (కే) గ్రామంలో పచ్చని చెట్లకు రాఖీలు కట్టిన మహిళలు. పర్యావరణ ప్రేమ చాటుకున్న గ్రామస్థులు.
Ichoda: ప్రకృతికే రాఖీ ఇచ్చోడ మండలం ముఖరా (కే)లో పర్యావరణ రక్షాబంధన్!
Ichoda: పర్యావరణ పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామంలో రక్షాబంధన్ వేడుకలు సరికొత్త స్ఫూర్తిని నింపాయి. తోడబుట్టిన అన్నదమ్ములతో పాటు ప్రాణవాయువును ఇస్తూ జీవనాధారంగా నిలుస్తున్న చెట్లకు రాఖీలు కట్టి గ్రామ మహిళలు తమ పర్యావరణ ప్రేమను చాటుకున్నారు.
గతంలో గ్రామంలో నాటిన మొక్కలు నేడు రోడ్లకు ఇరువైపులా పందిరిలా పెరిగి గ్రామాన్ని పచ్చదనంతో నింపేశాయి. ఈ పచ్చదనాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా మహిళలు చెట్లకు రక్షాసూత్రాలు కట్టి వాటికి రక్షణగా నిలుస్తామని సంకల్పం తీసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ, పిల్లలకు కేవలం స్థిరాస్తులు సంపాదించి ఇవ్వడం కంటే వారు బ్రతకడానికి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని ఇవ్వడమే నిజమైన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమిస్తే అది మనకు రక్షణ కవచంగా నిలుస్తుందని తెలియజేస్తూ, ‘ఒక రాఖీ ప్రకృతికి అంకితం’ అంటూ ప్రతి ఏటా చెట్లకు రాఖీలు కట్టి వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ముఖరా (కె) మహిళల ఆలోచన పర్యావరణ పరిరక్షణపై సమాజానికి బలమైన సందేశాన్నిచ్చింది.




