Neradigonda: కడెం నదీ తీరంలో 'నగరానికి ఏమైంది' సీక్వెల్ షూటింగ్!

Neradigonda: నిర్మల్ జిల్లా నేరడిగొండ మండలం వెంకటాపూర్ కడెం నదీ తీరంలో 'నగరానికి ఏమైంది' సీక్వెల్ సినిమా షూటింగ్ జరుగుతోంది.

NAGULA SATISH, BOATH
Published on: 5 Aug 2026 10:21 AM IST
Neradigonda
X

Neradigonda: కడెం నదీ తీరంలో 'నగరానికి ఏమైంది' సీక్వెల్ షూటింగ్!

Neradigonda: ​నేరడిగొండ మండలంలోని వెంకటాపూర్ పరిధిలో ఉన్న కడెం నదీ తీర ప్రాంతం సినీ షూటింగ్‌తో కోలాహలంగా మారింది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న 'నగరానికి ఏమైంది' (ఈ నగరానికి ఏమైంది సీక్వెల్) చిత్ర బృందం ఇక్కడి పచ్చని ప్రకృతి దృశ్యాల నడుమ షూటింగ్ నిర్వహించింది.

కడెం వాగు ఒడ్డున ప్రధాన పాత్రలో హీరో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి, అనీషా ఆంబ్రోస్‌లపై ముక్య దృశ్యాలను చిత్రీకరించారు. కాగా, ఈ ప్రాంతంలో సినీ తారలు సందడి చేస్తున్నారనే సమాచారంతో నేరడిగొండ సహా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చిత్రీకరణను తిలకించారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story