Adilabad: దళారులు, కేటుగాళ్లపై ఉక్కుపాదం.. ఎస్పీ అఖిల్ హెచ్చరిక!

Adilabad: రైతులను మోసం చేసే దళారులు, కేటుగాళ్లపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరిక. నెల రోజుల్లోనే 20 కేసులు నమోదు చేసినట్లు వెల్లడి.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 4 Jun 2026 5:05 PM IST
Adilabad
X

Adilabad: దళారులు, కేటుగాళ్లపై ఉక్కుపాదం.. ఎస్పీ అఖిల్ హెచ్చరిక!

Adilabad: అమాయక రైతులను లక్ష్యంగా చేసుకుని రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ సబ్సిడీలు మంజూరు చేయిస్తామని, తక్కువ ధరలకు వ్యవసాయ పరికరాలు అందిస్తామని, పంటలను అధిక ధరలకు కొనుగోలు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రైతుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు గత ఏడాది కాలంలో రైతులను మోసం చేసిన దళారులు, కేటుగాళ్లపై మొత్తం 25 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

ఈ సంవత్సరం రైతుల ను మోసం చేసే దళారుల పై ప్రత్యేక తనిఖీలు చేపట్టి నెల రోజులలో 20 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. రైతుల కష్టార్జిత డబ్బును మోసపూరిత పద్ధతుల్లో దోచుకునే వారి పట్ల ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాల లబ్ధి కల్పిస్తామని, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకే అందిస్తామని, పంటలకు అధిక ధరలు ఇప్పిస్తామని చెప్పి ముందస్తుగా డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పథకాల పేరుతో ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు లేదా ఇతర సంస్థల పేర్లతో డబ్బులు డిమాండ్ చేసినట్లయితే పూర్తిస్థాయిలో ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా రైతులతో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, మోసాలకు పాల్పడే వారి ఆటలను కట్టడి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story