Nirmal: నిర్మల్‌లో దివ్యాంగుల స్వయం ఉపాధి స్టాల్!
Nirmal: నిర్మల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు తయారుచేసిన శుభ్రత ఉత్పత్తుల విక్రయ స్టాల్. కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వాహకుల విజ్ఞప్తి.
Nirmal: నిర్మల్‌లో దివ్యాంగుల స్వయం ఉపాధి స్టాల్!
Nirmal: తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు స్వయంగా తయారు చేసిన ఫినాయిల్, యాసిడ్, బ్లీచింగ్ పౌడర్, బ్రష్‌లు తదితర శుభ్రత ఉత్పత్తులను నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు.
దివ్యాంగులు తయారు చేస్తున్న ఈ ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. దివ్యాంగుల స్వయం ఉపాధికి చేయూతనిస్తూ ‘మీ చేతుల మీదుగా స్వచ్ఛత–ఆరోగ్య భారతం’కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు సాయన్న, పెనుగొండ ముత్యం, పంచపుల తదితరులు పాల్గొన్నారు.
Next Story




