Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై సీపీఎం నేత బండారు రవికుమార్ ఆరా

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి సమస్యలపై సీపీఎం నేత బండారు రవికుమార్ ఆరా. ఖాళీగా ఉన్న డాక్టర్, నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 3 Aug 2026 11:35 AM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ సమస్యలపై సీపీఎం నేత బండారు రవికుమార్ ఆరా

ఆదిలాబాద్ జిల్లాకే తలమాణికంగా ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో.. పలు సమస్యల సైతం నెలకొన్ని ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిని పార్టీ నాయకులతో సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రభుత్వాసుపత్రులను సందర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో స్థానిక సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నప్పటికీ.. వారికి తగిన సౌకర్యాలు సైతం అందడం లేదన్నారు. రిమ్స్ లో ఖాళీగా ఉన్న నర్స్, డాక్టర్స్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి అందించడం జరుగుతుందని పేర్కొన్నారు

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story