Adilabad: దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట ఎమ్మెల్యే కవ్వంపల్లి
Adilabad: ఆదిలాబాద్ టీఎన్జీవోస్ భవనంలో కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ విస్తృతస్థాయి సమావేశం. ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ వేడ్మ బొజ్జు పాల్గొని ప్రసంగించారు.
Adilabad: దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట ఎమ్మెల్యే కవ్వంపల్లి
Adilabad: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశాన్ని స్థానిక టీఎన్జీవోస్ భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్మన్, MLA కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం శేఖర్ తోపాటు జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, నాయకుల సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్మన్, MLA కవ్వంపల్లి నారాయణ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసిందని అన్నారు. ఆదిలాబాద్ లో పార్టీ ఆయన మాట్లాడారు.
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని బిఆర్ఎస్ చెప్పి విస్మరించిందని కానీ ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్యను అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎస్సీ సెల్ నేతలు మరింత పని చేయాలన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పనిచేయని స్క్రాప్ ను పక్కకు పెట్టేసి పనిచేసే నేతలను ప్రాధ్యాన్యత ఇవ్వాలని పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు అన్నారు.పార్టీ పదవులు పొందిన వారు క్షేత్రస్థాయిలో వెళ్లి అందరిని సమన్వయం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడ్డ కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు.




