Gudihatnur: ఏడాదిన్నర పోరాటానికి తెర అనాథ పిల్లలకు అందిన ఆధార్ కార్డులు!

Gudihatnur: గుడిహత్నూర్ మండలంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ చిన్నారుల ఆధార్ కష్టాలు కలెక్టర్ రాజర్షి షా చొరవతో తొలగిపోయాయి.

NAGULA SATISH, BOATH
Published on: 30 July 2026 7:21 AM IST
Gudihatnur
X

Gudihatnur: ఏడాదిన్నర పోరాటానికి తెర అనాథ పిల్లలకు అందిన ఆధార్ కార్డులు!

Gudihatnur: సామాజిక కార్యకర్త ఆడే జైపాల్ చొరవతో అనాథ చిన్నారుల ఆధార్ కష్టాలకు తెరపడింది. గుడిహత్నూర్ మండలానికి చెందిన లటపటే మారుతి, కీర్తి దంపతుల మరణంతో అనాథలుగా మారిన చిన్నారుల సమస్యను ఆడే జైపాల్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లారు.

గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలో భర్త చేతిలో భార్య హతం ఆపై భర్త ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది, తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు పిల్లలు ఆనాదలయ్యారు, ​తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లల్లో లటపటే గాయత్రి, లటపటే ఉజ్వల్ అనే ఇద్దరు చిన్నారులకు ఆధార్ కార్డులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మంజూరు కోసం వారి తాత లటపటే జగన్నాథ్ దాదాపు ఏడాదిన్నరగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆడే జైపాల్ తక్షణమే అధికారులతో మాట్లాడి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్ రాజర్షి షా వెంటనే స్పందించి ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

అధికారుల సమన్వయంతో ఆధార్ కార్డులు జారీ కావడంతో చిన్నారులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆధార్ కార్డుల కోసం శ్రమించిన ఆడే జైపాల్‌కు, వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్‌కు తాత జగన్నాథ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH

Next Story