Asifabad: తుంపెల్లి వాగు వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ కె. హరిత

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు వద్ద వరద పరిస్థితిని జిల్లా కలెక్టర్ కె. హరిత పరిశీలించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 29 July 2026 1:49 PM IST
Asifabad
X

Asifabad: తుంపెల్లి వాగు వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్ కె. హరిత

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత బుధవారం పరిశీలించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుని, ప్రజల భద్రతకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.

అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story