Nirmal: కడెం ప్రాజెక్టును పరిశీలించిన నిర్మల్ కలెక్టర్!

Nirmal: నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది.

RAKESH N, KHANAPUR
Published on: 31 July 2026 12:59 PM IST
Nirmal
X

Nirmal: కడెం ప్రాజెక్టును పరిశీలించిన నిర్మల్ కలెక్టర్!

Nirmal: నిర్మల్ జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. వరద ఉధృతి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఇవాళ కడెం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో సందర్శించారు.

ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్.. ప్రస్తుత నీటి మట్టం, ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ఉధృతిని బట్టి నీటిని విడుదల చేసే సమయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. డ్యాం భద్రత విషయంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశించారు.

భారీ వరద ప్రవాహం ఉన్నందున ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని, నీటిని విడుదల చేసే సమయంలో ఎవరినీ డ్యాం కిందికి వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR

Next Story