Nirmal: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్!

Nirmal: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 11 Aug 2026 8:41 PM IST
Nirmal
X

Nirmal: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి కలెక్టర్!

నిర్మల్: నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఈ నెల 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నందున జిల్లాలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కడ్తాల్ సమీపంలోని సాగర్ కన్వెన్షన్ లో 15వ తేదీన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని పేర్కొన్నారు.

కొంతమంది లబ్ధిదారులను కార్యక్రమానికి ఆహ్వానించాలని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, సరైన లైటింగ్, సౌండ్ సిస్టం ఉండేలా చూడాలన్నారు.ఎల్ఈడి తెరను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి హాజరైన వారికి ఎప్పటికప్పుడు త్రాగునీరు అందిస్తూ ఉండాలన్నారు.

సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, ఆర్డిఓ దేవిదాస్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story