Adilabad: ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైలుభరో: సీఐటీయూ కిరణ్
Adilabad: కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 10న దేశవ్యాప్త జైలుభరో నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు.
Adilabad: ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైలుభరో: సీఐటీయూ కిరణ్
ఆదిలాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ ఆరోపించారు. కేంద్ర విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 10న దేశవ్యాప్తంగా జైలుభరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ సీఐటీయూ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి పాత చట్టాలను యధావిధిగా కొనసాగించాలని అన్నారు. విద్యుత్, విత్తన సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు. నాయకులు వెంకటనారాయణ, జగన్ సింగ్, దళిత్, బండి దత్తాత్రి, ఉన్నారు
Next Story




