Chennur: జగన్నాథ ఆలయంలో తొలి ఏకాదశి పోటెత్తిన భక్తజనం!

Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని 400 ఏళ్ల చరిత్ర గల జగన్నాథ ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJENDER, CHENNUR
Published on: 25 July 2026 1:53 PM IST
Chennur
X

Chennur: జగన్నాథ ఆలయంలో తొలి ఏకాదశి పోటెత్తిన భక్తజనం!

Chennur: చెన్నూరు పట్టణంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని దేవాలయాలకు పోటెత్తిన భక్తులు.

తొలి ఏకాదశి పండుగ రోజు ఆ విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మిక.

భక్తుల కొంగు బంగారం, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా పూజించే ఇలవేల్పు,

నిత్యం దుపాదీప నైవేద్యాలతో పూజలందుకునే దేవదేవుడు ఆ జగన్నాథుడు.

మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణ నడిబొడ్డున గల జగన్నాథాలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. దక్షిణ భారతదేశంలోనే రెండో ఆలయంగా పేరుగాంచింది.

స్వామి వారిని ఏకాదశి రోజుల్లో ఉపవాస దీక్షతో కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

జగమేలు ప్రభువు ఆ జగన్నాథుడు. అడిగిన వెంటనే కోర్కెలు తీర్చే కల్పతరువు...ఆపదలో ఉంటే ఆపద్బంధువై...అనుక్షణం రక్షించే దేవుడు. అణువణువునా నిండిపోయాడు.

ఆ జగన్నాథుడిని దర్శిం చాలంటే ఒడిశా రాష్ట్రంలోని పూరీ పట్టణానికి వెళ్లాల్సిన పని లేదు. మన వాకిట్లో కొలువుదీరి ఉన్నాడు. కొంగు బంగారంగా కొలిచే మరో' పూరి అయినా జగన్నాథాలయం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ లో ఉంది. ఆలయంలో స్వామి వారు నిత్యం పూజలందుకుంటారు. చెన్నూర్ ప్రాంత ప్రజలు ఏపనులు చేయాలన్నా ఇక్కడి స్వామి వారిని దర్శించుకునే పనులు మొదలు పెడతారు. ఈ ఒక్క విషయం చాలు స్వామివారి మహిమలు చెప్పడానికి మరి.

నాలుగు వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో ఒక రాజుకి జగన్నాథ స్వామి కలలో కనిపించి అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంలోదేవాలయం నిర్మించాలని కోరారని పురాణాలు చెప్తున్నాయి.

ఆ రాజు ఒరిస్సా రాష్ట్రంలోని పూరి పట్టణానికి వెళ్లి జగన్నాతస్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడే ప్రతిష్టించినట్లు అనంతరం కొంత కాలానికి ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు.

పూరిలో నిర్వహించే రదయాత్ర సందర్భంగా ఇక్కడి ఆలయంలో అభిషేక సేవలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఆలయం ముందు నాలుగు వందల ఏళ్ల క్రితం తయారు చేసిన రధం ఉంది. శ్రీరామ నవమి రోజునభక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. గోదాదేవి కళ్యాణం శ్రీనరసింహ హోమాన్ని నిర్వహించడం ఆనవాయితీ..డిసెంబర్ నెలలో ఏకాదశి రోజున స్వామి వారిని ఉత్తర ద్వార దర్శన ఉత్సవాన్ని కన్నుల పండువగా చేస్తారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story