Mancherial: మంచిర్యాల: చెన్నూరులో ‘చేపల వర్షం’.. ఆశ్చర్యపోయిన జనాలు!

Mancherial: మంచిర్యాల: చెన్నూరులో ఆకాశం నుంచి పడిన చేపలు. రోడ్లు, ఇళ్ల ముందు వింతగా చేపల వేటలో పడ్డ స్థానికులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.

RAJENDER, CHENNUR
Published on: 30 July 2026 2:21 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల: చెన్నూరులో ‘చేపల వర్షం’.. ఆశ్చర్యపోయిన జనాలు!

మంచిర్యాల జిల్లా

చెన్నూరు పట్టణంలో చేపల వర్షం కురిసింది.

చెన్నూరు పట్టణంలోని పూప్పల హనుమాన్ వీధిలో ఉన్నట్టుండి హఠాత్తుగా వింత ఘటన చోటుచేసుకుంది.

ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయ అని స్థానికులు ఆశ్చర్యపోయారు.

కాలనీలోని రోడ్లపై, ఇళ్ల ముందు పడిన చేపలను చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

వర్షపు గొడుగులు, సంచులు, బకెట్లతో చేపలను పట్టుకునేందుకు ప్రజలు, పిల్లలు పోటీపడ్డారు.

విషయం కాస్త ఆ నోట ఈ నోట తెలిసి దీంతో స్థానిక కాలనీలోని పిల్లలు, మహిళలు, యువకులు ఎంతో ఉత్సాహంగా ఆసక్తిగా చేపలను సేకరించి ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

ఈ వింత దృశ్యాన్ని స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అవి కాస్త వైరల్గా మారుతున్నాయి.

అయితే చేపలు ఎలా పడ్డాయన్న దానిపై స్థానికంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంత మంది భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా సమీపంలోని చెరువుల నుంచి చేపలు ఎగిరి వచ్చి ఉండొచ్చని భావిస్తుండగా, మరికొందరు నిజంగానే ఆకాశం నుంచి చేపల వర్షం కురిసిందని, మరికొందరు చెరువులు కాలువలో వరద నీరు చేరుతుండడంతో కొత్తనీరుకు చాపలు ఎదురీదువుతాయని దాంతో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని రకరకాలుగా చెప్పుకుంటున్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR

Next Story