Nirmal: కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని నిర్మల్‌లో బీఆర్ఎస్ ధర్నా!

Nirmal: నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని రామ్ కిషన్ రెడ్డి డిమాండ్.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 19 Aug 2026 12:53 PM IST
Nirmal
X

Nirmal: కళ్యాణ లక్ష్మి కొనసాగించాలని నిర్మల్‌లో బీఆర్ఎస్ ధర్నా!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజవర్గ ఇన్చార్జి రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేదలపై భారం పడకుండా కెసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని రద్దు చేసే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story