Chennur: చెన్నూరులో బీఆర్ఎస్ రాస్తారోకో కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్
Chennur: చెన్నూరు కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టేకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం.
Chennur: చెన్నూరులో బీఆర్ఎస్ రాస్తారోకో కళ్యాణలక్ష్మి పునరుద్ధరణకు డిమాండ్
Chennur: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బిఆర్ఎస్ శ్రేణుల ఆందోళన.చెన్నూరు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.కల్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాల నిలిపివేత పై ఆందోళన చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు.కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకాలను వెంటనే యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని పేదింటి ఆడబిడ్డలకు చేయూతగా కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకాలు అమలు చేశారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాన్ని నిలిపివేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు
అనంతరం, చెన్నూరు తాసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు.కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ పథకాలు తిరిగి పునరుద్ధరణ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బిఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.




