Neradigonda: ఘనంగా బోథ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు!
Neradigonda: నేరడిగొండలో బోథ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు. సోయం బాపూరావు, కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కేక్ కటింగ్.
Neradigonda: ఘనంగా బోథ్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు!
Neradigonda: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలు నేరడిగొండ మండల కేంద్రంలోని సూర్య గార్డెన్‌లో నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా జరిగింది, ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మాజి ఎంపీ సోయం బాపూరావ్ కంది శ్రీనివాస్ రెడ్డి ల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు, నిత్యం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆకాంక్షించారు.
ఈ వేడుకల్లో మాజీ ఎంపీ సోయం బాపూరావ్, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, డీసీసీబీ మాజీ ఛైర్మన్ అడ్డి భోజరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సాజిద్ ఖాన్, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.
వీరితో పాటు ఆత్మ ఛైర్మన్లు గొల్ల రాజు, కౌడాలా నారాయణ, బోథ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పసుల చంటి, గుడిహత్నూర్ సర్పంచ్ ఆడే శీల, గుడిహత్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దౌలత్ రావ్, నాయకులు అంకతి రవీందర్, కరాడ్ బ్రహ్మానందం, నాగనాథ్ అప్ప, బాలాజీ పటేల్, ఆడే జైపాల్ తదితరులు పెద్ద ఎత్తున హాజరై గజేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.




