Adilabad: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బోనాలు!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగిన బోనాల పండుగ. పోచమ్మ తల్లి ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు చేసి బోనాలు సమర్పించిన మహిళలు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా బోనాలు!
Adilabad: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండుగ సందడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండగ సందర్భంగా జిల్లాలోని పోచ్చమ్మ తల్లి ఆలయాలలో భక్త జన సందోహం కనిపించింది. పట్టణంలోని అశోక్ రోడ్డులో గల పోచ్చమ్మ తల్లి ఆలయంతో పాటు మహాలక్ష్మి వాడ లోని అమ్మవారి ఆలయంలో బోనాల సందడి నెలకొంది.
బోనాలను సమర్పించేందుకు ఆదివారం వేకువజాము నుండే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ పిల్ల పాపలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటూ ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పించుకున్నారు.
Next Story




