Boath: కాంగ్రెస్ వైఫల్యాలపై బోథ్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా!
Boath: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ భారీ ధర్నా. 'కాంగ్రెస్ బాకీ కార్డులు' పంపిణీ చేయనున్న నేతలు.
Boath: కాంగ్రెస్ వైఫల్యాలపై బోథ్‌లో బీఆర్‌ఎస్ భారీ ధర్నా!
Boath: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల పాలన పూర్తిగా వైఫల్యాల మయంగా మారిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నేడు బోథ్ మండల కేంద్రంలో భారీ ధర్నా కార్యక్రమనికి పిలుపునిచ్చింది.
ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శిస్తూ బోథ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ నాయకత్వంలో ఈ ధర్నా చేపట్టనున్నారు, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సామాన్య ప్రజలను, రైతాంగాన్ని మోసం చేసిందని మండిపడుతూ, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో బోథ్‌కు చేరుకుని తమ నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమయ్యారు.
ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ ప్రజలకు 'కాంగ్రెస్ బాకీ కార్డుల'ను పంపిణీ చేయనున్నారు, ప్రభుత్వం ప్రజలకు బకాయి పడ్డ ప్రతి అంశాన్ని ఈ కార్డుల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు. అంతేకాకుండా, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల ముందు నిలదీస్తూనే ఉంటామని నేతలు హెచ్చరించారు.




