Adilabad: పంట నష్టపరిహారం నిధులు వెంటనే విడుదల చేయాలి!
Adilabad: ఆదిలాబాద్ జిల్లా రైతులకు మంజూరైన ₹40 కోట్ల పంట నష్టపరిహారాన్ని ఫ్రీజింగ్ నుంచి తొలగించి రైతుల ఖాతాల్లో జమ చేయాలని బీజేపీ నేత సుహాసిని రెడ్డి డిమాండ్ చేశారు.
Adilabad: పంట నష్టపరిహారం నిధులు వెంటనే విడుదల చేయాలి!
Adilabad: గత ఏడాది భారీ వర్షాలతో భార పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం విడుదల చేసిన ఇంకా రైతుల ఖాతాలో జమ చేయలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు,చిట్యాల సుహాసిని రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ తో రైతు అనుబంధ సంఘాలకు వినతి పత్రాలు అందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురా అన్నట్లు తెలిపారు. . గత ఎడాది అధిక వర్షాలతో రైతులు పంట నష్టం పోయారని తెలిపారు.
ఆ సమయంలో ప్రభుత్వం సర్వే నిర్వహించి నలభై కోట్లు ఉమ్మడి జిల్లాకు మంజూరు చేస్తూ విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ ఆ నిధులను ఫ్రీజింగ్ లో ఉంచడంతో తొమ్మిది నెలలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజకీయల గతీతంగా ఉమ్మడి జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.




