Nirmal: భైంసాలో రైస్ మిల్లర్ల మీడియా సమావేశం.. నేటి నుంచి బంద్!

Nirmal: భైంసాలో రైస్ మిల్లర్లు మీడియా సమావేశం నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు మరియు తక్కువ మిల్లింగ్ ఛార్జీలకు నిరసనగా నేటి నుంచి బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించారు

Srinivas, Mondol Bhainsa
Published on: 11 Sept 2026 1:57 PM IST
Nirmal
X

Nirmal: భైంసాలో రైస్ మిల్లర్ల మీడియా సమావేశం.. నేటి నుంచి బంద్!

Nirmal: భైంసా పట్టణంలో రైస్ మిల్ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనకు విరుద్దంగా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నెటి నుండి బంద్ పాటిస్తున్నట్లు వివరించారు.

ఈ సందర్భంగా రైస్ అవుటర్న్ మెషిన్ తో వడ్లను ప్రత్యక్షంగా టెస్ట్ చేసి మీడియాకు చూపించారు. ప్రస్తుతం వస్తున్న వడ్లలో క్వింటాలుకు కేవలం 17 కిలోల బియ్యం మాత్రమే వస్తోందని, కానీ ప్రభుత్వం మాత్రం క్వింటాలుకు 67 కిలోలు ఇవ్వాలని నిబంధన పెట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే నిర్మల్ జిల్లాకు సంబంధించిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి పంపితే నాణ్యత లేదని రిజెక్ట్ చేస్తున్నారని తెలిపారు.

దిగుబడి తక్కువ, ఎఫ్‌సీఐలో రిజెక్ట్ తో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.మిల్లింగ్ చార్జీలలో కూడా తీవ్ర వ్యత్యాసం ఉందని అన్నారు. తెలంగాణలో క్వింటాలుకు రూ.20 ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో రూ.150, ఛత్తీస్ గడ్ లో రూ.200 ఉందని, తమకు కూడా క్వింటాలుకు రూ.150 చార్జీ కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కొరకు..

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa