Nirmal: భైంసా మున్సిపాలిటీ ముందు కాంట్రాక్టర్ల నిరసన!

Nirmal: భైంసా మున్సిపాలిటీ ముందు నాలుగో రోజూ కాంట్రాక్టర్ల నిరసన. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు కొత్త టెండర్లు నిర్వహించవద్దని అధికారులకు వినతి.

Srinivas, Mondol Bhainsa
Published on: 12 Sept 2026 1:26 PM IST
Nirmal
X

Nirmal: భైంసా మున్సిపాలిటీ ముందు కాంట్రాక్టర్ల నిరసన!

Nirmal: బైంసా పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు కొత్త టెండర్లు కొనసాగించొద్దని,ఇదివరకు టెండర్లు దక్కించుకున్న పలువురు కాంట్రాక్టర్లు పట్టణంలోని మున్సిపాలిటీ ముందు గత నాలుగు రోజులుగా నిరసనకు దిగారు.గతేడాది వినాయక చవితి, దుర్గామాత నవరాత్రులు,ధమ్మచక్ర పరివర్తన దివస్‌ పండగల సందర్భంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌లో ఉన్న గతేడాది బిల్లులను పూర్తిగా చెల్లించిన అనంతరం మాత్రమే ఈ ఏడాది పండగల టెండర్లు నిర్వహించాలని అధికారులను కోరారు. బిల్లులు చెల్లించకుండా టెండర్లు నిర్వహిస్తే అడ్డుకుంటామని పేర్కొంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa