Nirmal: ట్రాన్స్‌ఫార్మర్ రాగి తీగల దొంగల ముఠా అరెస్ట్!

Nirmal: భైంసా సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ రాగి తీగలు దొంగిలిస్తున్న 7 గురు సభ్యుల ముఠా అరెస్ట్. 250 కిలోల రాగి, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Srinivas, Mondol Bhainsa
Published on: 31 Aug 2026 6:15 PM IST
Nirmal
X

Nirmal: ట్రాన్స్‌ఫార్మర్ రాగి తీగల దొంగల ముఠా అరెస్ట్!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ సాయి కిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ ట్రాన్స్ఫార్మర్ లోని రాగి తీగల దొంగతనం కేసులో 7నిందితులను పట్టుకొనగా వీరిలో

ఒకరు మైనర్ ఉన్నట్లు వెల్లడించారు.

ఈ నిందితులలో ఒకరు భైంసా పట్టణానికి చెందిన వాడు కాగా మిగిలిన ఆరుగురు మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు.ఈ నిందితుల వద్ద నుంచి 4 ద్విచక్రవాహనాలు, 7చరణవాణిలు,250కిలోల రాగి స్వాధీనం చేసుకున్నారు.

గత 8నెలలో 33 కేసులో వీరు ఉన్నారని,డివిజన లోని మండలాల వారిగా ముధోల్ 8 ,తానూర్ 11,కుబీర్ 4,బాసర 3 భైంసా టౌన్3,భైంసా రూరల్ 2,కుంటాల 2 దొంగతనాల చేసినట్లు తెలిపారు.ఈ కేసును చెందిన పోలీసులకు భైంసా ఏఎస్పీ అభినందించి పారితోషికం అందించి అభినందించారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa

Next Story