Bellampalli: నీటి కోసం ఖాళీ బిందెలతో బెల్లంపల్లి మహిళల నిరసన!

Bellampalli: బెల్లంపల్లి 28వ వార్డులో నీటి ఎద్దడి. మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయాలని ఖాళీ బిందెలతో మహిళల నిరసన. అధికారుల నిర్లక్ష్యంపై బస్తీవాసుల ఆగ్రహం.

PRATHAP, BELLAMPALLI
Published on: 19 Aug 2026 12:47 PM IST
Bellampalli
X

Bellampalli: నీటి కోసం ఖాళీ బిందెలతో బెల్లంపల్లి మహిళల నిరసన!

Bellampalli: ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తి 28వ వార్డు ప్రజల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.

అనంతరం బస్తీ ప్రజలు మాట్లాడుతూ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ ను కేవలం వన్ టౌన్ వెనకాల గల గల్లీలో ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమని.

మా గల్లీని మాత్రమే చిన్నచూపు చూస్తున్నారని గతంలో పైపులైన్ ఇవ్వకుండా తవ్వి వదిలి పెట్టడం వల్ల చిన్నపిల్లలు పెద్దవారు ముసలివారు పడుతున్నారని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా పైపులైను ఇవ్వలేదని ఆ గుంతలు కూడా మా డబ్బులతోనే కుడుపుకోవడం జరిగిందని కావున 28వ వార్డులోని ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాకు మిషన్ భగీరథ పైప్లైన్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల 28వ వార్డులోని హనుమాన్ బస్తి ప్రజలు ఈ గల్లీలోనే కాదు మున్సిపల్ కార్యాలయం ముందు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం.

ఈ కార్యక్రమంలో, పసులేటి వెంకటేష్, చేను విజయ, మాటేటి రాజ్యలక్ష్మి, మాటేటి రాధా, పసులేటి రాధ, ముదుర కోళ్ల రాజవ్వ ముద్ర కోళ్ల లావణ్య, ఖమ్మం భూదేవి, నాగిశెట్టిరాణి , నాగిశెట్టి రమా ఇప్పకాయల రాజేశ్వరి, కలగనూరి సరిత, మాటేటి స్వరూప తదితరులు పాల్గొనడం జరిగింది

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story