Gudihatnur: ఆటోలో 22 మంది ప్రయాణం కేసు నమోదు!
Gudihatnur: ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 22 మందిని ఎక్కించిన డ్రైవర్‌పై గుడిహత్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.
Gudihatnur: ఆటోలో 22 మంది ప్రయాణం కేసు నమోదు!
Gudihatnur: కొద్దిపాటి సమయం ఆదా చేసుకోవాలనో, లేక కాసుల కక్కుర్తితోనో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి కోలుకోలేని విషాదాన్ని నింపుతాయి. గుడిహత్నూర్ ఎస్సై మరియు సిబ్బంది కలిసి మన్నూరు నుండి శాంతాపూర్ వెళ్లే మార్గంలో వాహనాల తనిఖీ చేస్తుండగా బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా నిలిచే ఒక ఘటన వెలుగుచూసింది. దాసరి మధుకర్ అనే వ్యక్తి తన ఆటోలో పరిమితికి మించి, అత్యంత నిర్లక్ష్యంగా మరియు ప్రమాదకరంగా ఏకంగా 22 మంది ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేసినట్లు గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
Next Story




