Adilabad: ఆదిలాబాద్‌లో వేల మందికి ఉచితంగా అస్తమా మందు పంపిణీ!

Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా జరిగిన ఉచిత ఆయుర్వేద ఉబ్బసం మందు పంపిణీ. మృగశిర కార్తె సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 8 Jun 2026 12:25 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో వేల మందికి ఉచితంగా అస్తమా మందు పంపిణీ!

Adilabad: మృగశిర కార్తేను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రనతో పాటు.. రోగ నిరోధక శక్తి ని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణి కార్యక్రమం ఆదిలాబాద్ లో పెద్ద ఎత్తున సాగింది. జిల్లా కేంద్రంలోని cci సమీపంలో గల వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ లో నిర్వహించిన ఆయుర్వేదిక్ మందు పంపిణి కార్యక్రమానికి పట్టణంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సోమవారం ఉదయం యువరాజ్ వైద్య దంపతులు, కుటుంబీకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రజలకు గుళికల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య కుటుంబీకుల అధ్వర్యంలో అస్తమా వ్యాధి నివారణకు చేపడుతున్న గుళికల పంపిణి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జూన్ ఎనిమిదవ తేదిన చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పట్టణంలోని వివిధ వార్డులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గుళికల మందుల కోసం బారులు తీరారు.

పెద్దలకు వివిధ ఆయుర్వేదిక మూలికలతో తయారుచేసిన గుళికలను వేయగా చిన్నారులకు చుక్కల మందును వేశారు. ఉదయం నుండే ప్రజలు బారులు తీరి గుళికలను వేసుకున్నారు. ఉబ్బసం వ్యాధి నియంత్రణకు వైద్య ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ద్వార మందు పంపిణి చేపడుతున్న నిర్వాహకులను పట్టణ ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తో పాటు సమితి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ మేరకు వైద్యులు యువరాజ్ వైద్య మాట్లాడుతూ.. దమ్ము, ఉబ్బసం వ్యాధి నియంత్రనతో పాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు మందును ఉచితంగా పంపిణి చేస్తున్నామని అన్నారు. రుతువులు మారే సమయంలో వచ్చే వ్యాధుల నుండి తట్టుకోవడానికి ఆయుర్వేద మందు విశేషంగా పని చేస్తుందని పేర్కొన్నారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story