Nirmal: నిర్మల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు!

Nirmal: నిర్మల్‌లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 15 Aug 2026 1:25 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు!

Nirmal: నిర్మల్ లో 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం, గాంధీ పార్క్, ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలంతో మనకు స్వాతంత్య్ర లభించిందన్నారు.

స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారి స్ఫూర్తితో మనం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనీ, ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారి నాయకత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత దేశం మూడో ఆర్థిక వ్యవస్థ ఎదిగిందంటే అది మోదీ గారి సుస్థిర పాలనకు నిదర్శనం అని తెలిపారు.

అనేక సంస్కరణలు, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని భారత్ ను ప్రపంచ శక్తిగా నిలుపుతున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీ గారికే చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, భూమయ్య, మేడిసెమ్మ రాజు, రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పట్టణ కౌన్సిలర్లు సాధం అరవింద్ , గంజి రాజు, శ్రీరామోజీ నరేష్, అర్జున్, జింక సూరి, శశాంక్, విఠల్, సూరజ్, సాత్విక్, ఈశ్వర్, నాయకులు అలివేలు మంగ, నారాయణ గౌడ్, కందుల హరీష్, జప ప్రసాద్, జుట్టు దినేష్, అల్లం భాస్కర్, ఓడ్నాల రాజు, గిల్లి విజయ్, తో పాటు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL

Next Story