Ichoda: మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు మిగిలేది ఉరే: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Ichoda: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే రైతులకు ఉరితాళ్లే మిగులుతాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హెచ్చరించారు.
Ichoda: మోటార్లకు మీటర్లు పెడితే రైతులకు మిగిలేది ఉరే: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇచ్చోడ: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తే అన్నదాతలకు ఉరితాళ్లే మిగులుతాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇచ్చోడ మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులతో కలిసి ఆయన వినూత్నంగా నిరసన చేపట్టారు. మెడలో ఉరితాళ్లు వేసుకొని, చేతుల్లో ఉరితాళ్లను ప్రదర్శిస్తూ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులకు గతంలో మాదిరిగానే 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలని, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాలరాస్తే సహించేది లేదని, అన్నదాతల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు తులా శ్రీనివాస్, కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్, ప్రీతమ్ రెడ్డి, పాండురంగ్, తిరుమల గౌడ్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




