Adilabad: హైదరాబాద్ దిగ్బంధనానికి పిలుపు టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరిక
Adilabad: పెండింగ్ డిమాండ్ల కోసం సెప్టెంబర్ 10న లక్ష మందితో హైదరాబాద్‌ను దిగ్బంధనం చేస్తామని టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Adilabad: హైదరాబాద్ దిగ్బంధనానికి పిలుపు టీజీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హెచ్చరిక
ఆదిలాబాద్: డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 10 న తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి కనీసం లక్ష మందిని తరలించి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధనం చేస్తామని టిజిఇజెఎసి రాష్ట్ర కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందుకోసం మారుమూల ఆదిలాబాద్ జిల్లా నుండి కనీసం 3 వేల మంది ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి సన్నాహకంగా ఈరోజు స్థానిక టిఎన్ జివో కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొన్న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు బాగా లేదన్నారు. రెండు సంవత్సరాలు ఓపిక పట్టండి అన్ని సమస్యలు పరిష్కరిస్తా అనడం విచారకరం అన్నారు.
అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వేచిచూడమని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించేవరకు సమరం కొనసాగుతుందని అన్నారు. ఉపముఖ్యమంత్రి చర్చల పేరుతో ఉద్యోగ సంఘాలను పిలిచి, సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం హామీ నివ్వకుండా ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమని చెప్పడం విడ్డూరం అన్నారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటిస్తే తప్ప పోరాటం ఆగదని తెలిపారు.
టిజిఇజెసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి బుట్టదాఖలు చేశారన్నారు. రెండు రోజుల్లో పిఆర్సీ రిపోర్టును తెప్పించుకుని అమలు చేస్తామని ప్రకటించి దానిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఆరు డిఎలను చెల్లించాలని, పెండింగ్ బిల్లులు 10 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలని సూచించారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ను పకడ్బందీగా, పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లా జెఎసి చైర్మన్ ఎ నవీన్ కుమార్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర టీజీ జెఎసి నాయకులు దామోదర్ రెడ్డి (PRTU), A.వెంకట్ (TSUTF), సదానందం గౌడ్,(STUTS ), కట్కం రమేష్ (TRTF), T. లింగారెడ్డి (DTF ), తిరుపతి (TRTF), T లచ్చిరాం (TUTF ), శ్యామ్ (TGO), అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా JAC నాయకులు , కె. శివకుమార్,(TGO ) కె.కృష్ణకుమార్, స్వామి (PRTU ),K. కిష్టన్న V.అశోక్ (TSUTF), మూగ శ్రీనివాస్ , P. నరేందర్ (STUTS), వృకోధర్ (TPTF ), శ్యామ్యూల్, దిలీప్ (DTF), K. చంద్రశేఖర్, సతీష్ (TRTF), సుదర్శన్ (TTU ), అదేవిధంగా ఈ సమావేశం లో ఉపాధ్యాయులు ఉద్యోగులు, పెన్షనర్లు కార్మికులు పాల్గొన్నారు.




