Adilabad: తలమడుగులో 'పోలీసులు మీకోసం'.. 26 సీసీ కెమెరాలు ప్రారంభం!
Adilabad: తలమడుగు మండలం ఉమ్రిలో 'పోలీసులు మీకోసం' సదస్సు జరిగింది. 26 సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్, గంజాయి నిర్మూలనకు పిలుపునిచ్చారు.
Adilabad: తలమడుగులో 'పోలీసులు మీకోసం'.. 26 సీసీ కెమెరాలు ప్రారంభం!
అదిలాబాద్: అదిలాబాద్ జిల్లా ప్రజలకు మరింత చేరువై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం, గ్రామాల్లో పోలీసు-ప్రజల సత్సంబంధాలను బలోపేతం చేయడం, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో'పోలీసులు మీకోసం' కార్యక్రమం తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో నిర్వహించారు... కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఉమ్రి గ్రామ ప్రజలు సాంప్రదాయ ఆదివాసి డేంశ నృత్యంతో జిల్లా ఎస్పీని ఘనంగా ఆహ్వానించారు, గ్రామ మహిళలు జిల్లా ఎస్పీకి రాఖిని కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామంలో ఉన్న కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి గ్రామంలో ఏర్పాటు చేసిన "పోలీసులు మీకోసం" కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులకు గ్రామ మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా దేవాపూర్ మరియు తలమడుగు గ్రామాలలో ఏర్పాటు చేసిన 26 సీసీటీవీ కెమెరాలను గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రతి గ్రామం సీసీటీవీ నిఘాలో ఉంటే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని అన్నారు. గ్రామ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, సీసీటీవీలు ప్రజల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటూ సీసీటీవీల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామ ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. "గంజాయిపై యుద్ధం చేయాలి.. మార్పు వల్లే గంజాయిని సమాజం నుంచి దూరం చేయవచ్చు అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.




