Adilabad: చాందీ వాగు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
Adilabad: ఆదిలాబాద్‌లో గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. గజ ఈతగాళ్లు, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు ఆదేశాలు.
Adilabad: చాందీ వాగు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ఆదిలాబాద్: గణపతి నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని చాంద టి వాగు వద్ద నిమజ్జన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆప్యాయతతో ఎస్పీకి గణపతి నిమజ్జన పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ ఎస్సై వి. విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.




